పెద్దగట్టు జాతరకు ఏర్పాట్లు పూర్తి: మంత్రి జగదీశ్‌ రెడ్డిపెద్దగట్టు జాతరకు ఏర్పాట్లు పూర్తి: మంత్రి జగదీశ్‌ రెడ్డి

share on facebook

మాజాన్ని ఒక క్రమపద్ధతిలో నడపడంలో ఆయా ప్రాంతాలు, వర్గాల సంస్కృతీ సాంప్రదాయాల పాత్ర కీలకమని మంత్రి జగదీశ్‌ రెడ్డి అన్నారు. ప్రజలను ఐక్యం చేయడంలో పెద్దగట్టు వంటి జాతరలు దోహదపడుతాయని చెప్పారు. రాష్ట్రంలో రెండో అతిపెద్ద జాతరకు ప్రభుత్వం తరుపున అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయన్నారు. సూర్యాపేటలోని గొల్ల బజార్ ఎల్లమ్మ గుడిలో పెద్దగట్టు జాతరలో తొలి ఘట్టమైన మకర తోరణం తరలిపు ప్రక్రియను ప్రత్యేక పూజలు చేసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్బంగా రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్‌తో కలిసి భేరీలు వాయించారు. అనంతరం మంత్రి జగదీశ్‌ రెడ్డి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో అన్ని కులాలు, మతాలకు సమన్యాయం కల్పించామన్నారు.ఆదివారం రాత్రి కేసారం నుంచి దేవర పెట్టే తరలింపు ప్రక్రియ ఉంటుందని చెప్పారు. సోమవారం నుంచి జాతరకు భక్తులు వస్తారని వెల్లడించారు. మూడు రోజులపాటు తెలంగాణ నలుమూలల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా 15 లక్షల మంది భక్తులు వస్తారని తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులూ తలెత్తకుండా ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు

Other News

Comments are closed.