పెద్దవాగు ప్రాజెక్టులోకి భారీగా పోటెత్తిన వరద నీరు

అశ్వరావుపేట: ఖమ్మం జిల్లా అశ్వరావుపేట మండలంలో కురిసిన భారీ వర్షానికి పెద్దవాగు ప్రాజెక్టులోకి వరద నీరు పోటెత్తింది. దీంతో ప్రాజెక్టు మూడు గేట్లు ఎత్తి మూడు వేల క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి వదిలారు. భారీవర్షంతో పట్టణంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మండలంలోని వాగులు ఉప్పొంగడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.