పెను తుపానుగా మారనున్న నీలం

చెన్నై: బంగాళాఖాతంలో చెన్నై తీరానికి సమీపంలో 260 కి. మీ దూరంలో కేంద్రీ కృతమై ఉన్న నీలం పెను తుపానుగా మారే అవకాశాలు ఉన్నట్లు చెన్నై వాతావరణ శాఖ అధికారులు తెలియజేశారు. ఈ సాయంత్రానికి పుదుఛ్ఛేరి-నెల్లూరు మధ్య తీరందాటే అవకాశం ఉన్నట్లు చెప్పారు. తుపాను తీరం దాటే సమయంలో గంటకు 90 నుంచి 125కి.మీ మేర బలమైన గాలులు వీస్తాయని.. తీర ప్రాంత జిల్లాలో యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సూచించారు.