పార్టీ బలోపేతం..ప్రజల సమస్యల పరిష్కారం కోసం కృషి.
రాజన్న సిరిసిల్ల బ్యూరో., న (జనం సాక్షి). జిల్లాలో బలోపేతం తో పాటు ప్రజల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంతో మాట్లాడి కృషి చేస్తానని డి.సి.సి అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్ అన్నారు. మంగళవారం డి.సి.సి .కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ప్రభుత్వం విప్. ఆది శ్రీనివాస్ డి.సి.సి అధ్యక్షులుగా సంగీతం శ్రీనివాస్ కు బాధ్యతలు అప్పగించారు. ప్రజలతో మమేకమై పార్టీ విస్తరణకు ప్రజల సమస్యల పరిష్కారం కోసం బాధ్యతగా పనిచేయాలని ప్రభుత్వం విప్ ఆది శ్రీనివాస్ ఈ సందర్భంగా శ్రీనివాసును కోరారు. ఈ సందర్భంగా డి.సి.సి. అధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరించిన సంగీతం శ్రీనివాస్ మాట్లాడుతూ సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలోని అన్ని వర్గాల కోసం ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఏప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారం దిశగా అడుగులు వేస్తామని అన్నారు. కాంగ్రెస్ పార్టీ జిల్లాలో బలమైన శక్తిగా మలచడం కోసం శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని అన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాల నాయకులతోపాటు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.



