పెన్షన్‌ పునరుద్దరణ కోసం తప్పనిపోరు

కార్మిక రంగాన్ని నిర్వీర్యం చేస్తున్నారని సంఘాల ఆందోళన

హైదరాబాద్‌,సెప్టెంబర్‌1(జ‌నం సాక్షి): పాత పెన్షన్‌ విధానాన్ని పునరుద్దరించి ఆదుకోవాలన్న ఉద్యోగుల డిమాండ్లను ప్రభుత్వాలు పెడచెవిని పెడుతున్నాయి. టీచర్లు ఎంతోకాలంగా తమ పెన్షన్‌ పునరుద్దరించాలని కోరుతున్నా పట్టించుకోవడం లేదు. దీంతో గతంలో సామూహిక సెలవులోకి వెళ్లారు. ఇకపోతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలను అనుసరిస్తున్నాయని ఆయా కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. వివిధ స్థాయిల్లో ఉద్యోగ,కార్మిక రంగాల్లో భద్రత భయపెడుతోంది. ప్రపంచీకరణ కారణంగా కార్మికరంగం ఒత్తిడికి గురవుతూనే ఉందని ఆందోళన చెందుతున్నారు. అంతేగాకుండా తీవ్ర ఆటుపోట్లకు కార్మికులు గురవుతున్నారు. వీరి హక్కులకు భంగం వాటిల్లుతోంది.దేశవ్యాప్తంగాఅన్ని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో గతేడాది సెప్టెంబర్‌ 2న దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చాయి. ఉద్యోగ, కార్మిక వ్యతిరేక విధానాలపై మరోమారు లెఫ్ట్‌ కార్మిక సంఘాలు ఉద్యమిస్తున్నాయి. కార్మిక వ్యవహారాల్లో ప్రభుత్వాలు ఇటీవల కార్పోరేట్‌ అనుకూల ధోరఇతో ఉన్నాయి. కార్మికులకు కనీస వేతనం రూ.18వేలు చెల్లించాలని సంఘాలుడిమాండ్‌ చేస్తున్నాయి. గతేడాది కూడా ఇలాగే వామపక్ష కార్మిక సంఘాలు దేశవ్యాప్తం అందోళనకు పిలుపునిచ్చాయి. ప్రధానంగా అసంఘటిత రంగంలో ఆందోళన తీవ్రంగా ఉంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ వ్యతిరేక విధానాలపై దేశవ్యాప్తంగా ఉద్యోగులు సంఘటితం కావాల్సిన ఆవసరం ఉన్నదని, నూతన పెన్షన్‌ విధానాన్ని రద్దు చేసేవరకు ఉద్యమాలు చేస్తామని తెలిపారు. ప్రధానంగా దేశంలోని అసంఘటిత రంగ కార్మికులు దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. గ్రాట్యుటీ, ఈఎస్‌ఐ తదితర అన్ని సదుపాయాలను పక్కాగా అమలు చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఎన్నికల సమయంలో అనేక వాగ్దానాలు చేసిన మోడీతో పాటు వివిధ రాస్ట్రాల ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చిన తరువాత కార్మికులతోపాటు ప్రజలను నిలువునా మోసం చేశారన్నారు. బిజెపి తన మూడున్నర సంవత్సరాల ప్రభుత్వ హయాంలో ప్రజా, కార్మిక వ్యతిరేక విధానాలు అమలు చేస్తున్నదన్నారు. విదేశీ పెట్టుబడులకోసం విదేశాలకు తిరుగుతూ కార్మిక సంక్షేమాన్ని పూర్తీగా విస్మరించారన్నారు. కార్మికులు తాము ఎదుర్కొనే సమస్యలను చెప్పుకోవాలని అడిగితే సమయం లేదంటూ దాట వేస్తున్నారని విమర్శించారు. పోరాటాలతో సాధించుకున్న కార్మికుల హక్కులను కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కాలరాస్తోందని ఆరోపించారు.