పెన్షన్ కార్డులు, కళ్యాణలక్ష్మీ చెక్కుల పంపిణీ….

ఎమ్మెల్యే చిలుముల మదన్ రెడ్డి…
మహిళా కమిషన్ చెర్పర్సన్ సునీతలక్ష్మారెడ్డి…

చిలప్ చేడ్/4సెప్టెంబర్/జనంసాక్షి :-
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తరువాత సీఎం కేసీఆర్ పాలనలో తెలంగాణ ప్రజలు సుఖసంతోషాలతో జీవనం కోనసాగిస్తున్నారని ఎమ్మెల్యే చిలుముల మదన్ రెడ్డి అన్నారు ఆదివారం నాడు చిలప్ చేడ్ మండలంలోని శీలంపల్లి రైతు వేదికలో ఏర్పాటు చేసినకార్యక్రమంలో నూతన పెన్షన్ కార్డుల పంపిణీ అలాగే కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే మదన్ రెడ్డి రైతువేదిక ఆవరణలో 553మందికి పెన్షన్ల కార్డులను పంపిణీ చేశారు అదేవిధంగా మండలంలోని వివిధ గ్రామాలకు సంబంధించిన 20మందికి కల్యాణలక్ష్మి షాదిముబారక్ చెక్కులను పంపిణీ చేశారు అనంతరం శీలంపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ఎమ్మెల్యే మదన్ రెడ్డి ,మహిళ కమిషన్ చైర్మన్ సునీత లక్ష్మారెడ్డితో కలిసి ప్రారంభించారు. గ్రామస్తుల భద్రత కోసం దాతలు నారాయణగారి భాస్కర్ రెడ్డి, ఎల్లయ్యగారి అనుపాల్ రెడ్డి, సహకారంతో గ్రామంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడంతో ఎమ్మెల్యే మదన్ రెడ్డి, సునీత లక్ష్మారెడ్డి దాతలను అభినందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చిలుముల మదన్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం వచ్చాకే ప్రజలు సుఖసంతోషాలతో ఉన్నారని, ముఖ్యమంత్రి కేసీఆర్ తో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకెళ్తుందన్నారు. మండలంలో ఇప్పటికే చాలా అభివృద్ధి పనులను చేశామని, కొత్తగా వచ్చిన 553మందికి పించన్లు మంజూరు చేశామని, ఇంకా మండలంలో కొంతమందికి రాలేదని బాధపడకూడదని, వారికీ కూడా త్వరలోనే ముఖ్యమంత్రితో మాట్లాడి వచ్చేలా చూస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ వినోద దుర్గారెడ్డి వైస్ ఎంపీపీ విశ్వంభస్వామి తాసిల్దార్ కమలాద్రి ఆర్ ఐ �