పెరటిలో పండ్లు పూల మొక్కలను పంపిణీ చేసిన సర్పంచ్ మద్దెల మంజుల నాగరాజ్

భువనగిరి యాదాద్రి జనం సాక్షి :—
భువనగిరి భువనగిరి జిల్లా వలిగొండ మండలంలో కేచుపల్లి గ్రామంలోని గ్రామపంచాయతీ ఆవరణలో పచ్చదనం పల్లె పకృతి వనం నర్సరీలో పండ్ల పూల మొక్కలను గ్రామ సర్పంచ్ మద్దెల మంజుల నాగరాజ్ గ్రామంలోని ప్రతి ఇంటిలో పెరట్లోని మొక్కలు పెంచుకునేందుకు ప్రతి ఇంటికి మొక్క నాటాలి కార్యక్రమంలో సర్పంచ్ చేతులు లేదుగా గ్రామంలోని మహిళలకు రైతులకు మొక్కలు అందజేశారు . ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఇంటిలోని మొక్కలతో పచ్చదనం కళకళలాడుతూ అందంగా ఉంటుందని అన్నారు ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్లు పంచాయతీ సెక్రెటరీ గ్రామ సిబ్బంది నాయకులు తదితరులు పాల్గొన్నారు.