పేకాటరాయుళ్ల అరెస్టు

మండల కేంద్రంలోని గురువారం నలుగురు పేకాటరాయుళ్లను అరెస్టు చేసినట్లు బీర్కూర్‌ ఎస్సై మధుసూదన్‌రెడ్డి తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం పేకాట ఆడు తున్నట్లు సమాచారం అందిన వెంటనే దాడి నలుగురిని అదుపులోకి తీసుకొని 3,300 రూపాయలను స్వాధీనపర్చుకున్నట్లు ఆయన తెలిపారు. కేసు నమోదు చేసుకొని నిందితులను రిమాండ్‌కు పంపనున్నట్లు ఆయన అన్నారు.