పేదలందరూ గౌరవప్రదంగా ఆర్షిక భద్రతతో జీవించడమే ముఖ్యమంత్రి కె. సి. ఆర్. సంకల్పం
సెప్టెంబర్ 5 (జనంసాక్షి) హైదరాబాద్
*ఆసరా పెన్షన్స్ తో పేద కుటుంబాలకు అండగా నిలుస్తున్న తెలంగాణ ప్రభుత్వం*ఆసరా పెన్షన్స్ తో పేద కుటుంబాలకు అండగా నిలుస్తున్న తెలంగాణ ప్రభుత్వం పించన్లు పొందే వయస్సును 65 నుంచి 57 ఏండ్లకు తగ్గించిన తెలంగాణ ప్రభుత్వంకొత్తగా 10 లక్షల మందికి ఆసరా పింఛన్లురాష్ట్రంలో 45 లక్షల 80 వేల 864 కు పెరిగిన ఆసరా లబ్ధిదారుల సంఖ్యఆసరా పింఛన్లకు సంవత్సరానికి రూ.12 వేల 60 కోట్ల 23 లక్షలు వ్యయం చేయనున్న తెలంగాణ ప్రభుత్వం
తెలంగాణలోని అన్ని వర్గాలకు అభివృద్ధి, సంక్షేమ పధకాల ప్రయోజనాల ఫలాలను అందించుటకు ఉద్యమనేత ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు నాయకత్వంలోని ప్రభుత్వం చిత్తశుద్ధి, అంకితభావంతో పనిచేస్తున్నది.పేదలందరూ గౌరవప్రధంగా ఆర్ధిక భద్రతతో జీవించాలనే ఉద్దేశ్యంతో 2014 నవంబర్ నుంచి ఆసరా పింఛన్ల పధకాన్ని ప్రభుత్వం అమలు చేస్తున్నది. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు, హెచ్. ఐ. వి.-ఎయిడ్స్, ఫైలేరియా ప్రభావిత వ్యక్తులు ( గ్రేడ్-2,3), చేనేత, కల్లుగీత కార్మికులు, బీడీ కార్మికులకు ఆసరా పెంఛన్లు ఇచ్చి అండగా నిలుస్తున్నది. తెలంగాణ ఏర్పడే నాటికి నెలకు రూ.200 ఉన్న పెన్షన్లును తెలంగాణ ప్రభుత్వం భారీగా పెంచింది.ఆసరా పెన్షన్లు కింద ప్రస్తుతం దివ్యాంగులకు నెలకు రూ.3,016 లు, ఇతరులకు రూ.2,016 లను తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్నది. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా పేదలందరికి ఇంత సంఖ్యలో, ఇంత మొత్తంలో పెంఛన్లు ఇవ్వడం లేదు. అదేవిధంగా పూర్తి పారదర్శకంగా ప్రతినెలా టంచనుగా లబ్ధిదారుల ఖాతాలలో నేరుగా పెన్షన్ సొమ్మును ఒక్క తెలంగాణ ప్రభుత్వామే జమజేస్తున్నది. అలాగే రాష్ట్రంలో ఉన్న 6,906 మంది డయాలాసిస్ బాధితులకు కూడా ప్రభుత్వం ఆసరా పెన్షన్లు ఇస్తున్నది.
ఆసరా పెన్షన్లు పొందే వయోపరిమితిని తాజాగా 65 ఏండ్ల నుంచి 57 ఏండ్లకు ప్రభుత్వం తగ్గించింది.దీనితో ప్రస్తుతం ఉన్న ఆసరా పెన్షన్ దారుల సంఖ్య 35 లక్షలు 95 వేల 675 నుంచి 45 లక్షల 80 వేల 746 కు చేరుతుంది. కొత్తగా ఇస్తున్న పెన్షన్లకు సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వం అదనంగా రూ.3,000 లను ఖర్చు చేయనున్నది. అందులో 65 ఏండ్లవయస్సు నిండిన, ఇతర లబ్ధిదారులు సంఖ్య 3 లక్షల 87 వేల 864 మంది ఉన్నారు.అలాగే వయోపరిమితిని 57 ఏండ్లకు కుదించుట వలన మరో 5 లక్షల 97 వేల 207 మంది లబ్ధి పొందనున్నారు. లబ్ధిదారుల సంఖ్యకు అనుగుణంగా నిధుల కేటాయింపును కూడా రాష్ట్ర ప్రభుత్వం గణనీయంగా పెంచుతున్నది. ఆసరా పెన్షన్లకు నెలకు రూ.975 కోట్ల 75 లక్షలు చొప్పున సంవత్సరానికి రూ.12 వేల 60 కోట్ల 23 లక్షలను రాష్ట్ర ప్రభుత్వం వ్యయం చేయనున్నది.
ప్రస్తుతం ఇస్తున్న పించన్లు 35 లక్షలు 95 వేల 675నెలకు ఇస్తున్న పించన్ల మొత్తం 771 కోట్ల 33 లక్షలుసంవత్సరానికి ఇస్తున్న మొత్తం 9 వేల 255 కోట్ల 96 లక్షలు
57 సంవత్సరముల వరకు కొత్త పించన్లు 5 లక్షల 97 వేల 207కావలసిన మొత్తం (నెలకు) 120 కోట్ల 40 లక్షలుసంవత్సరానికి 1 వెయ్యి 444 కోట్ల 76 లక్షలు
ఇతర కొత్త పించన్లు 3 లక్షల 87 వేల 864కావలసిన మొత్తం (నెలకు) 84 కోట్ల 2 లక్షలుసంవత్సరానికి 1 వెయ్యి 8 కోట్ల 24 లక్షలు
మొత్తం పించన్లు 45 లక్షల 80 వేల 746వ్యయం నెలకు 975 కోట్ల 75 లక్షలుసంవత్సరానికి వ్యయం 12 వేల 60 కోట్ల 23 లక్షలు
———————————————శ్రీయుత కమిషనర్ , సమాచార పౌర సంబంధాల శాఖ , హైదరాబాద్ వారిచే జారీ చేయనైనది