పేదలకు అల్పాహార వితరణ.

తాండూరు సెప్టెంబర్ 25(జనంసాక్షి)వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణం అయ్యప్ప నగర్ లో కోలువుదీరిన శ్రీదర్మశాస్త అయ్యప్పస్వామి ఆలయంలో అయ్యప్పస్వామి జన్మనక్షత్రం ఉత్తర నక్షత్రాన్ని పురస్కరించుకుని ఆలయంలో
స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి ఆధ్వర్యంలో ఆదివారం అల్పాహారాన్ని పంపిణీ చేశారు. దాత కన్నం శ్రీనివాస్ రెడ్డి ద్వారా తాండూరు మండల పరిషత్ వంతెన కింద బాటసారులు, వృద్ధులు, నిరుపేదలకు అల్పాహారం, తాగునీటిని అందజేశారు. సమితి ద్వారా ప్రతినెలా సేవా, దాన కార్యక్రమాలను కొనసాగించడం అభినందనీయమని స్థానికులు కొనియాడారు. కార్యక్రమంలో సమితి జిల్లా అధ్యక్షులు బాకారం జైపాల్రెడ్డి, ప్రచార కార్యదర్శి కొంపల్లి రమేష్, కోశాధికారి నవీన్ కుమార్, ఆలయ సంఘ అధ్యక్షులు వెంకట్ రావు , ప్రధానకార్యదర్శి కేశవరెడ్డి, నరహరి, శ్రీకాంత్, గోపాల్ యాదవ్, కల్వ సంతు, శ్రీనివాస్ పాల్గొన్నారు.