పేదలకు తక్కువ ఖర్చుతో మందుల దుకాణాలు

బెంగళూర్‌: పేదలకు తక్కువ ధరలకు లభ్యమయ్యేలా జనరిక్‌ ఔషధ దుకాణాలను దేశవ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రారంభిస్తామని కేంద్ర ఆరోగ్యమంత్రి గులాంనబీ అజాద్‌ తెలిపారు. జనరిక్‌ జాబితాలోకి మరిన్ని మందులను తెచ్చే ఆలోచన ఉందన్నారు. తక్కువ ఖర్చుతో క్యాన్సర్‌, గుండె వ్యాధుల చికిత్సలను పేదలకు అందించాల్సిన అవసరం ఉందన్నారు. పేదల ఆరోగ్యం దృష్ట్యా వైద్యరంగానికి ఎక్కువ నిధులు కేటాయించినట్లు చెప్పారు. ప్రభుత్వ సూపర్‌ స్పెషాలిటి ఆసుపత్రుల్లో పేదలకు తక్కువ ఖర్చుకే ఆధునిక వైద్యం అందించాలని సూచించారు.