ప్రేమ జంట ఆత్మహత్యాయత్నం

కరీంనగర్‌: కరీంనగర్‌ జిల్లాలో ఓ ప్రేమ జంట ఆత్మహత్యకు యత్నించింది. ఈ ఘటనలో ప్రియురాలు మృతి చెందగా ప్రియుడి పరిస్థితి విషమంగా ఉంది. రామడుగు మండలం వెలచాలకు చెందిన అనిల్‌, రజితలు కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. అనిల్‌ హైదరాబాద్‌లో హోటల్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సు చదువుతుండగా రజిత కరీంనగర్‌ ఇంటర్‌ చదువుతుంది. వీరి ప్రేమ వ్యవహారం తెలిపిన పెద్దలు ఇద్దరినీ మందలించడం ఆత్మహాత్యకు పాల్పడారు. అనిల్‌ ను కరీంనగర్‌లోని ఆస్పత్రికి తరలించారు.