పేలుడు పదార్థాలు స్వాధీనం

శ్రీకాకుళం: పట్టణ సమీపంలోని చేపలనాయుడుపేటలో ఓ ఇంట్లో దాచిన పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటీలో 34 జిలెటిన్‌స్టిక్స్‌, 67 డిటోనేటర్లు, ఒక బ్యాటరీ ఉన్నట్లు తెలియజేశారు. ఈ ఘటనలో నలుగురిని అరెస్టు చేసి విచారణ చేపట్టినట్లు రెండో పట్టణ పోలీసులు చెప్పారు.