పొలంలో వజ్రం

తుగ్గలి: కర్నూలు జిల్లా తుగ్గలి మండలం లక్ష్మీతండాలో ఓ రైతుకు తన పొలంలో వజ్రం లభించింది. దానిని తెరవలికి చెందిన ఓ వ్యాపారికి రూ. 7లక్షలు, 10తులాల బంగారం ఇచ్చి కొనుగోలు చేశాడు. రైతు తన పొలంలో ఉన్న రాళ్లను గట్టకు తరలిస్తుండగా ఈ వజ్రం లభించినట్లు తెలిసింది.