పోలవరంపై విపక్షాలు అనవసరం రాద్దాంతం చేయవద్దు

శీకాకుళం: రాష్ట్ర సాగునీటి ప్రయోజనాలను కాపాడుతాయని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. ఇందిరమ్మ బాట పర్యటనలో భాగంగా సీఎం శ్రీకాకుళం జిల్లాలో పర్యటిస్తున్నారు. అముదాలవలస మండలం అక్కులపేటలో ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించారు. బూర్జ మండలం ఏ.అర్‌. రాజుపేటలో ట్రాక్టర్‌తో స్వయంగా వరినాట్లు వేశారు. అనంతరం రైతులనుద్దేశించి ప్రసగించారు. పోలవరం ప్రాజెక్టుపై విపక్షాలు అనవసర రాద్ధాంతం చేయవద్దని హితవు పలికారు. రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు.