పోలవరంలో క్రమంగా పెరుగుతున్న గోదావరి నీటిమట్టం

ఏలూరు: ఎగువన కురుస్తున్న వర్షాలతో పశ్చిమగోదావరి జిల్లా పోలవరంలో క్రమంగా గోదావరి నీటిమట్టం పెరుగుతోంది. వరద ఉద్ధృతితో జిల్లాలోని కొత్తూరు, రామయ్యపేట గ్రామాల్లో రహదారులు నీట మునిగాయి. దీంతో 15 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.