పోలింగ్ స్టేషన్లోకు తరలి వెళ్లిన ఎన్నికల సిబ్బంది

తుంగతుర్తి నవంబర్ 29 (జనం సాక్షి)
నేడు జరగనున్న సాధారణ ఎన్నికల్లో భాగంగా నియోజకవర్గంలోని తొమ్మిది మండలాలకు సంబంధించిన గ్రామాలకు బుధవారం ఎన్నికల సిబ్బంది తమకు కేటాయించిన ఈవీఎం యంత్రాలతో పాటు ఎన్నికల సామాగ్రితో పటిష్ట పోలీసు బందు బస్సు మధ్య ఎన్నికల సిబ్బంది వాహనాలలో తరలి వెళ్లారు. ఈ మేరకు తుంగతుర్తి ఎన్నికల డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో తుంగతుర్తి నియోజకవర్గ ఎన్నికల అధికారి ఆధ్వర్యంలో సిబ్బంది తమ ఎన్నికల సామాగ్రిని తీసుకొని తమ కేటాయించిన గ్రామాలకు తరలి వెళ్లారు ఈ మేరకు ఎన్నికల రిటర్నింగ్ అధికారి మాట్లాడుతూ పోలింగ్ సెంటర్లలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా చూడాలన్నారు పటిష్ట పోలీసు బందోబస్తు మధ్య ఎన్నికల సిబ్బంది వాహనాలలో తరలి వెళ్లారు