పోలీసుల తనిఖీలపై పరిటాల సునీత ఆగ్రహం
అనంతరం : తన నివాసంలో పోలీసులు తనిఖీలు చేపట్టడంపై ఎమ్మెల్యే పరిటాల సునీత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలాంటి అనుమతులు లేకుండా పోలీసులు తన ఇంట్లో ఎలా తనిఖీలు చేస్తారని ఆమె ప్రశ్నించారు. పోలీసులు తన ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించారని స్పీకర్‌కు ఫిర్యాదు చేస్తానని చెప్పారు. గతంలో పరిటాల రవిని కూడా ఇలాగే తనిఖీలు చేసి వేధించి చంపారని ఆమె ఆరోపించారు. కాంగ్రెస్ నేత హత్యకు కుట్ర పన్నినట్లు పరిటాల రవి తనయుడు శ్రీరామ్‌పై కేసు నమోదు కావడంతో అతన్ని అరెస్టు చేసేందుకు పోలీసులు ఈ ఉదయం సునీత ఇంట్లో తనిఖీలు చేపట్టారు.