పోలీసుల వైఫల్యంపై ఇప్పుడే చెప్పలేం: షిండే
హైదరాబాద్: దిల్‌సుఖ్‌నగర్ బాంబు పేలుళ్ల ఘటనలో 14 మంది మృతి చెందినట్లు కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్‌కుమార్ షిండే తెలిపారు. ఈ ఘటనలో 119 మంది గాయపడగా అందులో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. ఈఘటన పోలీసుల వైఫల్యమా? లేదా అనేది ఇప్పుడే చెపంపలేమని అన్నారు. ఈఉదయం నగరానికి వచ్చిన షిండే ఘటనా స్థలాన్ని సందర్శించి, క్షతగాత్రులను పరామర్శించారు. అనంతరం లేక్‌వ్యూ అతిధి గృహంలో మీడియాతో మాట్లాడారు. పేలుళ్ల ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తు బృందాన్ని నియమించిందని తెలిపారు. దర్యాప్తు వేగంగా జరుగుతుందని చెప్పారు. దర్యాప్తులో అన్ని వివరాలు బయటపడుతాయని వెల్లడించారు. ఉగ్రవాదుల దాడులపై రెండుమూడు రోజుల ముందే అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసినట్లు పేర్కొన్నారు. ఈ ఘటనపై పార్లమెంట్‌లో ప్రకటన చేస్తామని ఆయన చెప్పారు.