పోలీసు ఉన్నతాధికారులతో హోంమంత్రి సబిత సమీక్ష
హైదరాబాద్ గణేష్ నిమజ్జనం, తెలంగాణ కవాతు జీవ వైవిద్య సదస్సులకు సంబంధించి భద్రతా చర్యలపై హోంమంత్రి సభితా ఇంద్రారెడ్డి పోలిసు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. శాంతిభద్రతల విభాగం డీజీ హుడా, ఇంటెలిజేన్స్ చీఫ్ మహేందర్‌రెడ్డి హైదరాబాద్ , సైబరాబాద్ పోలిసు కమిషనర్లు అనురాగ్ శర్మ, ద్వారకా తిరుమలరావుతోపాటు ఇతర ఉన్నతాధికారులు ఈ భేటికి హజరయ్యారు.గణేష్ నిమజ్జన ఏర్పాట్లను పోలిసులు మంత్రికి వివరించారు. తెలంగాణ మార్చ్‌పై నిఘావర్గాలు సేకరించిన సమాచారాన్ని కూడి ఈ భేటిలో విశ్లేషించినట్లు సమాచారం.



