పోషణ పక్షంలో అన్న ప్రసన్నము,అక్షరాభ్యాసం పై అవగాహన సమావేశం

గద్వాల నడిగడ్డ మార్చి 29 (జనం సాక్షి);
జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు ప్రాజెక్టు పరిధిలోని వడ్డేపల్లి మండల పరిధిలోని తిమ్మాజి పల్లె గ్రామంలోనీ అంగన్వాడి కేంద్రంలో బుధ వారం పోషణ పక్షం లో అన్న ప్రసన్నం, అక్షరాభ్యాసం పై అవగాహన సమావేశం నిర్వహించినట్లు అంగన్వాడీ టీచర్ ఫరీదా తెలిపారు. పిల్లల్లకు పుట్టిన 6 నెలల తర్వాత అన్న ప్రసన్నం చేయాలని, అదేవిధంగా 2 సంవత్సరముల 11 నెలల తర్వాత అక్షరాభ్యాసం చేయాలని,పోషకాహార లోపాల్ని నివారించుట వారికి సంపూర్ణ ఆరోగ్య అభివృద్ధి కి పోషకాహార పరిజ్ఞానం పట్ల అవగాహన కల్పించడం కోసం పోషణ పక్షంలో భాగంగా అవగాహన సమావేశం నిర్వహించినట్లు ఆమె అన్నారు.ఈ కార్యక్రమంలో గర్భిణీ స్త్రీలు, బాలంతలు, సర్పంచ్ మాధవి, వార్డు సభ్యులు జయంతి, పద్మమ్మ ,,ఆశ వర్కర్ లు, అంగన్వాడి ఆయాలు తదితరులు పాల్గొన్నారు.