పౌష్టికాహారంతోనే ఆరోగ్యం.

– సీడీపీఓ ఉమాదేవి.
బెల్లంపల్లి, సెప్టెంబర్29,(జనంసాక్షి)
పౌష్టికాహారం తోనే ఆరోగ్యం అని బెల్లంపల్లి సీడీపీఓ ఉమాదేవి అన్నారు. గురువారం ఆమె బెల్లంపల్లి పట్టణంలోని 4వ అంగన్వాడీ కేంద్రంలో ఏర్పాటు చేసిన పోషణ మాసం కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు.
సెప్టెంబర్ 1 నుంచి 30 వరకు పోషణ మాస కార్యక్రమాలు జరుగుతున్నాయి అని అందులో భాగంగా ఈరోజు బెల్లంపల్లి 4వ అంగన్వాడీ కేంద్రంలో ఈకార్యక్రమం నిర్వహించినట్లు ఆమె తెలిపారు. పోషక విలువలు గల ఆహారంను ప్రతి ఒక్కరూ ప్రతిరోజు తినాలని, ఆహారం తినే ముందు తప్పనిసరిగా చేతులు శుభ్రపరుచుకోవాలి వివరించారు. పోషణ మాసం మొదటి 15 రోజులు పిల్లలందరి ఎత్తు, బరువు, జబ్బచుట్టు కొలతలు, ప్రతి అంగన్వాడీ కేంద్రంలో తీసుకోవడం జరిగిందన్నారు. గర్భిణీ, బాలింతలు, పిల్లలు సమతుల ఆహారం తీసుకోవాలని పోషణతోనే మంచి ఆరోగ్యం ఉంటుందని వివరించారు. తాజా ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు అధికంగా తీసుకోవాలని ముఖ్యంగా గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు అవసరమన్నారు. పారిశుద్ధ్యం, పోషణ పసిపిల్లలకు తల్లిపాల ఆవశ్యకత తెలియజేశారు. అనంతరం పోశణ ప్రతిజ్ఞ తల్లులందరిచే చేయించారు.
ఈ కార్యక్రమంలో ఐసీడీస్ సూపర్ వైజర్ జ్యోతి, ఐకేపీ దుర్గ్గయ్య, చైల్డ్ లైన్ సుమలత , పోషణాభియన్ కరుణ, గర్భిణిలు, బాలింతలు, తల్లులు, పిల్లలు అంగన్వాడీ టీచర్లు, ఆయాలు పాల్గొన్నారు.