ప్టాస్టిక్‌ గోదాములో అగ్నిప్రమాదం

హైదరాబాద్‌: ఎల్బీనగర్‌లోని జైపూర్‌ కాలనీలోని ఓ ప్లాస్టిక్‌ గోదాములో అగ్ని ప్రమాదం సంభవించింది. మంటలు భారీగా ఎగసిపడుతుండటంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చేందుకు యత్నిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు.