ప్రకాశం బ్యారేజ్‌కు తగ్గుతున్న వరద నీరు

కృష్ణా: ప్రకాశం బ్యారేజ్‌కి వరదనీరు తగ్గుతోంది. బ్యారేజ్‌ వద్ద ఇన్‌ఫ్లో 46,658 క్యూసెక్కులు ఉండగా ఔట్‌ఫ్లో 32,625 క్యూసెక్కులు ఉంది. బ్యారేజ్‌ ప్రస్తుత నీటిమట్టం 12 అడుగులు. 45 గేట్లను అడుగుమేర ఎత్తి నీరు విడుదల చేస్తున్నారు.