ప్రచారం ఫుల్! పనితనం నిల్!!ప్రచారం ఫుల్! పనితనం నిల్!!తూతూ మంత్రంగా సాగుతున్న మనఊరు మనబడి పనులు.ఎంపీటీసీ కొట్టం మనోహర్

share on facebook


కోటగిరి ఫిబ్రవరి 3 జనం సాక్షి:-మండలంలో మన ఊరు మనబడి కార్యక్రమానికి ఎంపికైన ప్రభుత్వ పాఠశాలలో పలు అభివృద్ధి పనులు మందకొండీగా, తూతూ మంత్రంగా సాగుతున్నాయని స్థానిక ఎంపీటీసీ కొట్టం మనోహర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం మండలంలోనీ ఎంపిడిఓ కార్యాలయంలో మన ఊరు మనబడి కార్యక్రమంలో భాగంగా పాఠశాలలో జరుగుతున్న పనుల పనితీరును సమీక్షించడానికి వచ్చిన స్పెషల్ ఆఫీసర్ రమేష్, ఎంపీడీవో మనోహర్ రెడ్డి,ఎంఈఓ నాగనాథ్ లను స్థానిక ఎంపీటీసీ కొట్టం మనోహర్ పనుల పురోగతి లోపాల విషయంపై మాట్లాడుతూ.. పేద పిల్లలకు నాణ్యమైన చదువును అందిస్తూ కార్పొరేటర్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ బడులను తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం మొదటి విడత కార్యక్రమాలు పూర్తి చేసుకొని,రెండో విడత కార్యక్రమాలు చేపడుతూన్న,బడులలో మాత్రం అభివృద్ధి పనుల పనితనం శూన్యం మన్నారు.కానీ పనుల ప్రారంభోత్సవాలు,ప్రచారాలు మాత్రం హంగు ఆర్భాటాలుగా సాగిస్తున్నారని అన్నారు.ఇక ఈ పనుల పర్యవేక్షణ చూసే ఏఈ మాత్రం అసలు ఉన్నట్టా లేనట్టా అని మండిపడ్డారు.ఉమ్మడి మండలంలో మన ఊరు మన బడి కార్యక్రమానికి ఎంపికైన ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాల కల్పన,మేజర్,మైనర్ పనులు నాణ్యత లోపంతో పాటుగా తూతూ మంత్రంగా సాగుతున్నాయని సోషల్ ఆఫీసర్ దృష్టికి తీసుకువచ్చారు.అలాగే కోటగిరి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో బహిరంగంగా ఉంచేసిన సంపు(గుంత)కు ఎలాంటి కంచే గాని రక్షణ కానీ లేకుండా ఉంచేస్తే అక్కడ చదువుకునే విద్యార్థులకు ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యులు అని ప్రశ్నించారు.అలాగే మండలంలో జరిగే మన ఊరు మన బడి పనులు చేపట్టే కాంట్రాక్టర్లు,పర్యవేక్షించే ఏఈ విషయంలో స్పెషల్ ఆఫీసర్ రమేష్,ఎంపిడిఓ మనోహర్ రెడ్డి,ఎంఈఓ నాగనాథ్ లకు వివరణ కోరగా వారు పొంతన లేని సమాధానాలు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఇకనైనా ప్రభుత్వ ప్రతినిదులు,అధికారులు ప్రభుత్వ పాఠశాల రూపు రేఖలు మారుస్తాం,పేద పిల్లలకు నాణ్యమైన ఆంగ్ల విద్యను అందిస్తామనే ప్రచారాలు, ఆర్భాటాలను పక్కనపెట్టి ప్రత్యక్షంగా పేద పిల్లలకు సర్కార్ బడులలో మౌలిక వసతులు పక్కాగా కల్పించాలని డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా స్పెషల్ ఆఫీసర్ మాట్లాడుతూ..కోటగిరి పాఠశాలలో  ప్రమాదకరంగా ఉన్న సంపుకు ఇరు వైపులా కంచేను ఏర్పాటు చేస్తామన్నారు.మండలంలో జరుగుతున్న మన ఊరు మన బడి పనుల విషయమై అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తప్పమన్నారు.

Other News

Comments are closed.