ప్రజలంతా భాగస్వాములు కావాలి: బృందాకారత్‌

విశాఖపట్నం: అహారభద్రత కోసం వాముపక్ష పార్టీలు ఉమ్మడిగా సాగించే పోరాటంలో ప్రజలంతా భాగస్వాములు కావాలని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యురాలు బృందాకారత్‌ పిలుపునిచ్చారు. ఆహార భద్రత హక్కు చట్టాన్ని  అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ విశాఖపట్నం కలెక్టరేట్‌ ఎదుట సీపీఎం ఆధ్వర్యంలో ఈ రోజు ధర్నా  నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బృందాకారత్‌ హాజరై ప్రసంగించారు. ఈ నెల 30 నుంచి అగస్టు 3 వరకు ఢిల్లీలో  పార్లమెంట్‌ ఎదుట ఆందోళన కార్యక్రమం చేపడుతున్నామని, ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు.