ప్రజాసమస్యలపై అభిలపక్షం : నారాయణ

హైదరాబాద్‌ : రాష్ట్రంలోని ప్రజానీకం ఎదుర్కొంటున్న సమస్యలపై తక్షణమే అఖిల పక్ష సమావేశం నిర్వహించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ డిమాండ్‌ చేశారు. సచివాలయంలో ముఖ్యమంత్రి కలసిన ఆయన పదేళ్ల శిక్షాకాలం పూర్తిచేసుకున్న జీవిత ఖైదీలను ఆగస్టు 15న విడుదల చేయాలని కోరారు. వృద్ధులు, అనార్యోగంతో బాధపడేవారిని విడుదల చేసేందుకు ముఖ్యమంత్రి చొరవ తీసుకోవాలని కోరారు.