ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చ్చేస్తున్న మోడీ సర్కార్.
ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చ్చేస్తున్న మోడీ సర్కార్.
కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్.
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో పోస్టు కార్డుల నిరసన ఉద్యమం రాజన్న సిరిసిల్ల బ్యూరో. ఏప్రిల్ 03.(జనం సాక్షి). భారతీయ జనతా పార్టీకి పార్టీ ఇస్తున్న ఆదానిని కాపాడేందుకు మోడీ సర్కార్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుందని కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల పట్టణ అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్ అన్నారు. సోమవారం యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో పార్లమెంటు నుండి రాహుల్ గాంధీనీ సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ ప్రధాని మోడీకి పోస్టు కార్డుల ద్వారా నిరసన తెలిపారు. కార్యక్రమాన్ని ప్రారంభించిన కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్ మాట్లాడుతూ కోట్ల విలువైన ప్రజల ఆస్తులను అప్పనంగా ఆదానికి కట్టబెడుతున్న ప్రధాని మోడీ విధానాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బిజెపి పార్టీ పండ్ గా ఆదాని కంపెనీల నుండి ఎన్ని కోట్లు తీసుకున్నారో బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. పార్లమెంటు లో ఆదోని అక్రమాలపై ప్రశ్నించిన రాహుల్ గాంధీ పై కుట్రపూరితంగా వేటు విధించారని అన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు చొప్పదండి ప్రకాష్. యువజన కాంగ్రెస్ నాయకులు చిందం శ్రీనివాస్, రెడ్డిమల్ల భాను, అకిని సతీష్, జడల రాజు, జడల రాజు తదితరులు పాల్గొన్నారు.