ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ద్యేయం :చామకూర మల్లారెడ్డి:

share on facebook

శామీర్ పేట్, జనం సాక్షి : ప్రజల సంక్షేమమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ అహర్నిశలు పాటు పడుతున్నారని మంత్రి మల్లారెడ్డి అన్నారు. గురువారం తుంకుంట మొగుళ్ళ రామకృష్ణ ఫంక్షన్ హలులో మున్సిపల్ చైర్మన్ రాజేశ్వర్ రావు ఆధ్వర్యంలో,
శామీర్పేట్ మండల ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో ఎంపీపీ ఎల్లుభాయి బాబు ఆధ్వర్యంలో, ఎంసి పల్లి లో ఎంపీపీ హారిక మురళి గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన బతుకమ్మ చీరలు , కల్యాణ లక్ష్మి చెక్ ల పంపిణి కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డి పాల్గొన్నారు.
మండలంకు చెందిన
దాదాపు 5868 మంది మహిళలకు చీరల పంపిణి చేశారు .
అలాగే మండలంకు మంజూరు అయినా 47కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు అంద జేశారు .ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ వాణి వీరారెడ్డి, ఎంపీపీ ఎల్లుబాయ్, జడ్పీటీసీ అనిత, డీసీఎంస్ వైస్ చైర్మన్ మధుకర్ రెడ్డి,ఎంపీటీసీలు, సర్పంచ్లు, కౌన్సిల్లర్లు,నాయకులు సుదర్శన్, కృష్ణారెడ్డి, శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
22ఎస్పీటీ -1: చెక్, చీరలు అందజేస్తున్న దృశ్యం

Other News

Comments are closed.