ప్రజెక్టు పనులు నిలిపివేస్తాం

హైదరాబాద్‌: జలయజ్ఞం ప్రాజెక్టు పనులు నిలిచిపోవడానికి ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరే కారణమని బిల్డర్స్‌ అసోసియేషన్‌ ఆరోపించింది. టెండరు దాఖలు చేసినప్పటికీ, ప్రస్తుతానికి ప్రాజెక్టు నిర్మాణం విలువ రెట్టింపవుతోందనీ, ఫలితంగా పనులు చేపట్టలేకపొతున్నామన్నారు. నెల రోజుల్లో తమ డిమాండ్లు పరిష్కరించకుంటే పూర్తిస్థాయిలో అన్ని ప్రాజెక్టుల పనులు నిలిపివేస్తామని హెచ్చరించారు.