ప్రతి ఒక్కరు ఆధ్యాత్మిక చింతన అలవర్చుకోవాలి

పరిగి బీజేపీ ఇన్చార్జి  మిట్ట పరమేశ్వర్ రెడ్డి
దోమ పిబ్రవరి 10(జనం సాక్షి)
మానసిక దృఢత్వాన్ని పెంపొందించుకోవాలంటే ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఎంతో అవసరమని పరిగి బీజేపీ ఇన్చార్జి  మిట్ట పరమేశ్వర్ రెడ్డి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని కొల్లూరు శేఖర్ రెడ్డి స్వగృహంలో పరమేశ్వర శాస్త్రి ఆధ్వర్యంలో జరిగిన శివ స్వాముల పూజా కార్యక్రమానికి పరమేశ్వర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజా కార్యక్రమాలు  నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. ఆధ్యాత్మికతో మానసిక ప్రశాంతత లభిస్తుందని,ప్రతీ ఒక్కరు సామాజిక సేవాకార్యక్రమాలను అలవర్చుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కన్వీనర్ నరసింహులు,  దోమ,పరిగి బిజెపి మండల అధ్యక్షులు  శేరి రాంరెడ్డి,ఆంజనేయులు, పిఎన్పిఎస్ దోమ మండల అధ్యక్షుడు ప్రతాప్ గౌడ్,కార్యవర్గ సభ్యుడు రవికృష్ణ, ఎక్స్ ఆర్మీ తిరుపతి రెడ్డి, మండల కార్యదర్శి మహేష్ గౌడ్, చక్రధర్ రెడ్డి, తరుణ్ చారి తదితరులు పాల్గొన్నారు.