ప్రతి ఒక్కరు ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవాలి –

ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావుప్రతి ఒక్కరు ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవాలి -ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు
మంచిర్యాల కలెక్టరేట్, మార్చి 29 : ప్రతి ఒక్కరు ఆరోగ్యం పై శ్రద్ద వహించి జాగ్రత్తలు పాటించాలని మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు పేర్కొన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని కాలేజీ రోడ్డులోని సీనియర్ సిటిజన్డేకేర్ సెంటర్ ఆవరణలో డాక్టర్ కేర్ హోమియోపతి ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. 120మంది ప్రజలకు బీ.పీచెకప్ ఉచితంగా మందులు పంపణీ చేశారు. అనంతరం పలువురికి మందులు పంపిణీ చేశారు. వైద్యుడు మల్లేష్, ఆసుపత్రి మేనేజర్ రజితలు ఆరోగ్య సంరక్షణపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, ఆరోగ్యాన్ని పరిరక్షించుకుని అప్రమత్త ంగా ఉండాలన్నారు. కరోనా కాలంలో హోమియోపతి మం దులు ఉచితంగా పంపిణీ చేశారని ఇది అభినం దనీయమన్నారు. కరోనా నాటి నుంచి ఉచితంగా హోమియోపతి మందులు అందజేయడం గొప్ప విషయమన్నారు. అధిక డోసులు వాడితే శరీరంపై దు ష్ప్రభావం జరిగే అవకాశం ఉంటుందన్నారు.హోమియోపతి వంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని మందులను
వాడాలని సూచించారు. హోమియోపతి వైద్యంలో సాధారణ, దీర్ఘకాలిక వ్యాధులకు చికిత్స ఉంటుందని తెలి పారు. వ్యాధి తీవ్రత ఎలా ఉన్నా హోమియోపతి చికిత్సలు తీసుకోవాలన్నారు. కరోనా కాలంలో హోమియోపతి మం దులు ఎంతో ఉపయోగపడ్డాయన్నారు. ఎదిగే దశ నుంచి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరు ఆరోగ్యంపై శ్రద్ధ చూపి పౌష్టికాహారాన్ని తీసుకోవాలన్నారు. ఉదయం, సాయంత్రం వ్యాయామాలు చేయాలన్నారు. మెడికల్ క్యాంపు నిర్వహిం చిన వైద్యులను అభినందించారు. అనంతరం జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రెణికుంట్ల ప్రవీణ్ మాట్లాడుతూ  హోమియో పతి వైద్యం తో మెరుగైన చికిత్స అందుతుందన్నారు. ఆరోగ్యమే మహాభాగ్యము గా భావించాలనీ, వ్యాధి ఎలాంటిదైనా ప్రాథమిక దశలో నే చికిత్స తీసుకోవాలన్నారు. పోషకాలతో కూడిన ఆహారం తోపాటు ఆరోగ్యకర చిట్కాలు పాటించాలన్నారు.. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పెంట రాజయ్య, వైస్ చైర్మన్ ముకేష్ గౌడ్, కౌన్సిలర్లు అంకం నరేష్, అనిత రవీందర్ రావు, తాజుద్దీన్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు నరెడ్ల శ్రీనివాస్, నడిపెల్లి వెంకటేశ్వరరావు, శివ ఫోటో స్టూడియో సత్యం, జనార్ధన్, రమణ, ప్రభాకర్, రాజయ్య, రాజేశ్వరరావు, మోతె కనకయ్యతదితరులు పాల్గొన్నారు.