ప్రతి ఒక్కరు కంటి వెలుగు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి
– ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి
హుజూర్ నగర్ మార్చి 20 (జనంసాక్షి): ప్రతి ఒక్కరు కంటి వెలుగు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని స్థానిక ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. పట్టణంలోని దద్దనాల చెరువు ఒకటో వార్డు నందు నిర్వహించిన రెండవ విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని హుజూర్ నగర్ శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే సైదిరెడ్డి మాట్లాడుతూ కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని, కంటి వెలుగు కార్యక్రమంలోనే కండ్లను పరీక్షించి దృష్టిలోపం ఉన్నవారికి కండ్ల అద్దాలను అందిస్తారు. ఇంకా ఏమైనా కంటి సమస్యలు ఉన్న వారికి సంబంధించిన వైద్యం కూడా ప్రభుత్వమే అందిస్తుందని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కంటి వెలుగు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో క్యాంపు సూపర్వైజర్ ఇందిరాల రామకృష్ణ, డాక్టర్ సుష్మ, మల్లిక, శివ, మాధవి, ఆశా కార్యకర్తలు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.