ప్రతి ఒక్కరూ దైవచించిన తో పాటు సమాజ సేవలో కృషి చేయాలి వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్

మోమిన్ పేట జూన్ 7 జనం సాక్షిప్రతి ఒక్కరూ దైవచించాలతో పాటు సమాజసేవలో కృషి చేసినప్పుడే మనసు ప్రశాంతం భగవంతుని సన్నిధిలో గడిపిన వారు అవుతారని వికారాబాద్ జిల్లా, బి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ పేర్కొన్నారు బుధవారం మోమిన్ పేట్ మండల పరిధిలోని బాల్ రెడ్డిగూడ గ్రామంలో శ్రీ ఆంజనేయ స్వామి, గణపతి, శివపార్వతులు, నవగ్రహ, ధ్వజ స్తంభ మరియు గ్రామ నాభిశిల (బొడ్రాయి) ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని, ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో బాల్రెడ్డి గూడెం గ్రామ సర్పంచ్ చంద్రకళ గోవర్ధన్ రెడ్డి మర్పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ పటేల్ శ్రీకాంత్ గౌడ్ పిఎసిఎస్ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి విమల్ దరి గ్రామపంచాయతీ జాతీయ అవార్డు గ్రహీత నర్సింహారెడ్డి శనీశ్వర టెంపుల్ చైర్మన్ మైపాల్ రెడ్డి మండల సర్పంచ్ యువ సంఘం అధ్యక్షుడు హరి శంకర్ ఎంపీటీసీల సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి బి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షుడు డి వెంకట్ వెల్తాల్ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థాన కమిటీ చైర్మన్ ఎ ప్రతాప్ రెడ్డి దళిత రత్న అవార్డు గ్రహీత బుచ్చన్న ఆయా గ్రామాల సర్పంచులు ఎంపిటిసి సభ్యులు ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, భక్తులు మరియు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.