ప్రత్యేక రాష్ట్రం కాదంటే పతనం తప్పదు

చేర్యాల జూన్‌ 16 (జనంసాక్షి): నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయకుంటే కేంద్ర రాష్ట ప్రభుత్వాలకు పతనం తప్పదని టీఆర్‌ఎస్‌ రాష్ట యువజన ప్రధాన కార్యదర్శి కందుకూరి సిద్దిలింగం అన్నారు. శనివారం ఆయన మండల కేంద్రం లో విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణ ప్రజల మనోబావాల్ని కాంగ్రెస్‌, టీడీపీలు కించ పరిచే వి ధంగా వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. ప్రత్యేక రాష్ట ఏర్పాటు తోనే ఈ ప్రాంత సమస్యలు పరి ష్కారాం కావడమే కాకుండా ఆబివృద్ధి చేందుతుందన్న ఆక్కసుతోనే సీమాంధ్ర పార్టీలు ఆడ్డుకుంటు న్నాయని, అంతే కాకుండా వారి దోపీడి విధానాలకు ఆడ్డుకట్ట పడుతుందనే స్వార్దంతో తెలంగాణ వాదాన్ని క్రూరంగా అణిచి వేస్తున్నారన్నారు. ఇక తెలంగాణలో వారి ఆటలు సాగవని హెచ్చరిం చారు. పరకాల ఫలితాలతో తెలంగాణ ప్రాంత ప్రజా ప్రతినిధులు కళ్లు తెరచి ప్రజల పోరాటంలొ మమేకమై స్వరాష్టన్ని సాదించుకోవాలన్నారు.లేకుంటే ప్రజల చేత తిరస్కారానికి గురికాక తప్పదని హెచ్చరించారు. ఈ సందర్బంగా ఆయనతో మండల అధ్యక్షులు ఆంకుగారి శ్రీధర్‌ రెడ్డి, బొంగు సు రెేందర్‌ రెడ్డి, చాట్లా ప్రసాద్‌, ఆరుట్ల బాల్‌ నర్సయ్య, శివగారి నర్సింలు, ఆంజయ్య, చింతల పర్షరా ములు, మంచాల కొండయ్య, శ్రీదర్‌, ఆంజయ్య, చంటీ, షాదుల్లా తదితరులు పాల్గొన్నారు.