ప్రధాని పర్యటన రాష్ట్ర ప్రజల్లో స్థైర్యాన్ని నింపింది : బొత్స సత్యనారాయణ
ప్రధాని పర్యటన రాష్ట్ర ప్రజల్లో స్థైర్యాన్ని నింపిందని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ అన్నారు. జంట పేలుళ్ల ఘటనకు ప్రభుత్వమే బాధ్యత వహిస్తుందని.. ఇలాంటివి పునరావృతం కాకుండా పేలుళ్ల ఘటనకు ప్రభుత్వమే బాధ్యత వహిస్తుందని… ఇలాంటివి పునరావృతం కాకుండా చూస్తామని చేప్పారు. పేలుళ్లలో శాశ్వత అంగవైకల్యం ఏర్పడిన వారికి ప్రధాని ఆదేశాల మేరకు పరిహారంతోపాటు ఉద్యోగావకాశం కల్పిస్తామన్నారు. పాదయాత్రలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు దురదృష్ణకరమని మండిపడ్డారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ను భూస్థాపితం చేస్తామని చెప్పినవారందరూ. ఏమయ్యారో చరిత్ర తెలసుకొవాలని సూచించారు. రాష్ట్రంలో తెదేపా మూడు, నాలుగో స్థానాల్లో ఉంటుంది తప్ప… మొదటి రెండు స్థానాల్లోకి వచ్చే పరిస్థితి ఉత్పన్నం కాదని జోస్యం చెప్పారు.