ప్రధాని ప్రవేశపెట్టిన 15 సూత్రాల కార్యక్రమం అమలు జరగడంలేదు: సిరాజుద్దీన్‌

హైదరాబాద్‌: ముస్లింల అభివృద్ధి కోసం ప్రధాని ప్రవేశపెట్టిన 15 సూత్రాల కార్యక్రమం రాష్ట్రంలో అమలు జరగడంలేదని కాంగ్రెస్‌పార్టీ మైనార్టీ విభాగం ఛైర్మన్‌ మహ్మద్‌ సిరాజుద్దీన్‌ అన్నారు. 15 సూత్రాల కార్యక్రమం అమలుపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని వారు ఆందోళన వ్యక్తంచేశారు. దీన్ని అమలుచేయాలని కోరుతూ అన్ని జిల్లాల కలెక్టర్లకు వినతిపత్రం ఇవ్వనున్నట్లు సిరాజుద్దిన్‌ తెలిపారు. నామినేటెడ్‌ పోస్టులలో ముస్లింలకు స్థానం కల్పించాలని, స్థానిక ఎన్నికల్లో జనాభా ప్రాతిపదికన సీట్లు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరారు.