ప్రధాని మోదీని కలిసిన అరవింద్‌ కేజ్రీవాల్‌

దిల్లీ జ‌నంసాక్షి : దిల్లీ శాసనసభ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఆప్‌ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌ గురువారం ఉదయం ప్రధాని నరేంద్రమోదీని మర్యాద పూర్వకంగా కలిశారు. దిల్లీ సమస్యల పరిష్కారానికి సహకరించాలని ఈ సందర్భంగా కేజ్రీవాల్‌ ప్రధానిని కోరారు. ఈనెల 14న జరిగే తన ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరుకావాలని ప్రధానిని ఆహ్వానించారు. ప్రదానితో బ’ాటీ అనంతరం ఆప్‌ సీనియర్‌నేత మనీష్‌ సిసోడియా మీడియాతో మాట్లాడుతూ… ముందుగా నిర్ణయించిన కార్యక్రమాల కారణంగా… ప్రమాణస్వీకార కార్యక్రమానికి మోదీ హాజరు కావడంలేదని తెలిపారు.