ప్రధాని రాజీనామా కోరే హక్కు జనతాపార్టీకి లేదు

ఢిల్లీ: ప్రధాన మంత్రిని రాజీనామా కోరే హక్కు భాజపాకు లేదని బొగ్గుశాఖామంత్రి శ్రీప్రకాశ్‌జైస్వాల్‌ అన్నారు. బొగ్గు కుంభకోణంపై చర్చకు భాజపా వెనకాడుతోందని విమర్శించారు. ప్రధానికి సభలో విశ్వాసం ఉన్నంతవరకూ రాజీనామా అడిగే అధికారం ఎవరికీ లేదని జైస్వాల్‌ వ్యాఖ్యానించారు.