ప్రపంచమంతా కరోనా పాండమిక్‌

share on facebook

వాయువేగంతో అదాని ఆస్తులెలా పెరిగాయి

ఇది మహా కుంభకోణం ఆర్థిక విశ్లేషకుల అనుమానం

న్యూఢిల్లీ,మార్చి13(ఆర్‌ఎన్‌ఎ): కరోనా కాలంలో కూడా అదానీ ఆస్తులు భారీగా పెరగడం దేశంలో ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ప్రధాని నరేంద్ర మోడీ సన్నిహిత పారిశ్రామిక వేత్తగాపేరొందిన గౌతమ్‌ అదానీ అస్తుల పెరుగుదల వేగం ప్రపంచంలోనే అత్యధికంగా వుండటం ఆశ్చర్యం కలిగించక మానదు. గనులు, రేవు విమానాశ్రశయాలు  విద్యుత్‌ కేంద్రాలు వరుసగా ఆయనకు దఖలు పడుతున్న తీరు చూస్తూనే వున్నాం. క్కడో ఆస్టేల్రియాలో కూడా అదానీ గనులకు సమస్య వచ్చినా మోడీజీ జోక్యం కాపాడటం కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇదంతా నిజమే అయినా మరీ  అంతగా పెరగడం మాత్రం విశేషమే.  ఇంతా చేసి అదానీది వ్యాపార కుటుంబమేవిూ కాదు. తనే మొదటి తరం వ్యాపార వేత్త. ఎప్పుడూ పెద్దగా మాట్లాడరు. వివాదాలు తెచ్చుకోరు.కాని చాపకింద నీరులా వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోగలరు. వేల కోట్లు రాబట్టుకోగరు. 2021లో ఆయన ఆస్తుల విలువ 1620 కోట్ల డాలర్ల నుంచి ఏకంగా 5000 కోట్ల డాలర్లకు ఎగబాకాయి. ఈ మొత్తాన్ని ఆ రోజు డాలర్‌ విలువతో ఉదాహరణకు 75తో హెచ్చిస్తే భారతీయ విలువ వస్తుంది. ఇది కూడా  ఏదో దేశంలో  సంస్థ ఇచ్చిన లెక్క కాదు.  ప్రముఖఅంతర్జాతీయం సంస్థ బ్లూమ్‌ బర్గ్‌ శతకోటీశ్వరు సూచి ప్రకారం చెబుతున్నది. 2021లో నికరంగా ఆదాయం పెంచుకున్న వారిలో అదానీనే ముందున్నారట. అంటే ఆస్తి మొత్తంలో ఇతరులు ఎక్కువగా వుండొచ్చు గాని ఈ ఏడాది

పెంపుదలో ఆయన జెఫ్‌బెజోస్‌నూ, ఎలాన్‌ మస్క్‌నూ  కూడా దాటేశారు. ఆయన కంపెనీ షేర్లలో ఒకటి తప్ప మిగిలినవన్నీ యాభై పైగా పెరిగాయట.భారతదేశంలో అతిసంపన్నుడైన రియన్స్‌ అధినేత ముఖేశ్‌ అంబానీకి కూడా ఈ ఏడాదిలో అదనంగా చేరింది 800 కోట్లడాలర్లు కాగా అదానీకి ఏకంగా 3580 కోట్ల డాలర్లు కొత్తగా సమకూరాయి.

మొదటే చెప్పినట్లు ఈ కాలమంతటా అదానీ గనులు, రేవు విమానాశ్రశయాలు,  విద్యుత్‌ కేంద్రాలు,  డేటా సెంటర్లు  దేన్నీ వదకుండా తన పట్టు కొనసాగించారు. విపరీతమైన సమస్యలు తెచ్పిపెట్టిన ఆస్టేల్రియా  కార్మిచేల్‌ బొగ్గు గనులను కూడా వదలిపెట్టలేదు. మార్కెట్‌ ఒడుదుడుకుల ప్రభావానికి పెద్దగా లోనవని రంగాలోనే అదాని ఎక్కువగా దృషి పెట్టడం ఈ విస్తరణకు ప్రధాన కారణమని నిపుణులు అంటున్నారు. ఇప్పుడు డేటా సెంటర్లలో కూడా ప్రవేశించారు గనక ఇక సాంకేతికంగానూ దూసుకుపోవచ్చని ఇందులో కష్టం కన్నాలాభం ఎక్కువగా వుండొచ్చని వారంటున్నారు. మన దేశానికి ఒక గిగావాట్‌ డేటా సెంటర్‌ సామర్థ్యం పెంచడానికి గత నెలోనే అదానీఎంటర్‌ప్రైజెస్‌ లిమిటెడ్‌ ఒప్పందం చేసుకుంది.

విభాగాల  వారిగా చూస్తే అదానీ టోటల్‌ గ్యాస్‌ లిమిటెడ్‌ ఈ ఏడాది96శాతం పెరిగింది. అదానీ ట్రాన్స్‌ మిషన్‌లిమిటెడ్‌ 79శాతం పెరిగింది. మొట్టమొదటిసంస్థ అయిన అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ లిమిటెడ్‌ 90 శాతం వృద్ధి సాధించింది. ఇక అదానీ పోర్ట్స్‌ అండ్‌ స్సెషల్‌ జోన్స్‌ లిమిటెడ్‌ ఈ ఏడాది 52శాతంవిస్తరించింది. అదానీ గ్రీన్‌ ఎనర్జీ సంస్థ గత ఏడాదిపైన 500 శాతం పెరిగి 12శాతానికి చేరుకుంది. విశేషమేమంటే ఇందులో  ఏపీకి చెందిన కృష్ణపట్నం రేవు కూడా అదానీ చేతుల్లోకి వెళ్లింది, విశాఖ ఉక్కు తో ముడిపడిన గంగవరం రేవు, భోగాపురం విమానాశ్రయం కూడా వారి వశమైనాయి. విశాఖ రేవులోనూ వాటా పెరగనుంది, కేంద్రం ఆశీస్సులతో రాష్టాల్రు సహకరించకపోతే ఇంత ఏకపక్ష పెరుగుదల లాభాల పంట సాధ్యమేనా?

 

Other News

Comments are closed.