ప్రపంచ చెస్‌ ఛాంపియన్‌షిప్‌ : ఆనంద్‌ తొమ్మిదో గేమ్‌ డ్రా

రష్యా మే 24 :

ప్రపంచ చెస్‌ ఛాంపియన్‌షిఫ్‌లో భారత్‌ గ్రాండ్‌ మాస్ట ర్స్‌ విశ్వనాథన్‌ ఆనంద్‌ తోమ్మిదో గేమ్‌ డ్రా చేసుకు న్నాడు.ఆరంభంలో ఆనంద్‌ తడబడినట్లు కనిపించినా తర్వాత తన ఎత్తుల్లో వెగాన్ని పెంచి గెల్ఫాండ్‌ను కల వరపరిచాడు.49 ఎత్తుల తర్వాత గేమ్‌ డ్రాగా ముగి సింది.ప్రస్తుతం ఇద్దరూ 4.5 పాయింట్లతో కోనసాగు తున్నారు. ఇదిలా ఉండ గా ప్రపంచ చెస్‌ ఛాంపియన్‌ షిఫ్‌లో తోలి ఆరు గేమ్‌లను డ్రాగా ముగించిన ఆనంద్‌ ఏడోరౌండ్‌ గేమ్‌లో పరాజయం పాలయ్యాడు.అయితే డిపెండింగ్‌ ఛాంపియన్‌ గా బరిలోకి దిగిన భారత గ్రాండ్‌ మాస్టర్‌ విశ్వనాథన్‌ ఆనంద్‌ ఎనిమిదో గేమ్‌లో బోరీస్‌ గెల్ఫాండ్‌ (ఇజ్రాయెల్‌) పై విజయం సాధించి ప్రతికారం తీర్చుకున్నాడు.