ప్రపంచ తెలుగు మహాసభల ప్రాంగణాన్ని పరిశీలించిన సీఎస్
తిరుపతి: చిత్తూరు జిల్లా తిరుపతి గ్రామీణ మండలంలో ఆవిలీల చెరువు వద్ద డిసెంబరులో జరుగనున్న ప్రపంచ తెలుగు మహాసభల పనులను గురువారం ప్రభుత్వం ప్రధాన కార్శదర్శి మిన్నీ మాధ్యూ పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడ జరుగుతున్న పనులను ఆమెకు టీటీడీ ఈవో ఎల్వీ సుబ్రహ్మణ్యం, అర్బన్ ఎస్పీ ప్రభాకరావు, తెలుగు మహాసభల నిర్వాహకులు మండలి బుద్ధప్రసాద్ వివరించారు.



