ప్రపంచ శాంతికి అలీనోద్యమమే ఆయుధం

పరస్పర సహకారంతోనే అభివృద్ధి : ప్రధాని
సిరియా, పాలస్తీనా పరిస్థితిపై నావమ్‌ సదస్సులో చర్చ
టెహ్రాన్‌, ఆగస్టు 28 (జనంసాక్షి) :
ఇరాన్‌ అణ్వాస్త్ర ప్రయోగాలపై పాశ్చాత్య దేశాలు మండిపడుతున్న తరుణంలో.. గురు వారం టెహ్రాన్‌లో 16వ అలీన దేశాల సదస్సు (గురువారం) ప్రారంభమైంది. రెండ్రోజుల పాటు జరిగే ఈ సదస్సులో 120 దేశాలు పాల్గొంటున్నాయి. సిరియా సంక్షోభం, పాలస్తీనా పరిస్థితి తదితర అంశాలపై తొలిరోజు చర్చ జరిగింది. సదస్సులో భారత ప్రధాని మన్మోహన్‌సింగ్‌ మాట్లాడుతూ.. ఆలీనోద్యమ దేశాల్లో ఆహార భద్రత పెరగాల్సిన అవసరం ఉందని ప్రధాని అభిప్రాయపడ్డారు. ప్రపంచ శాంతిభద్రతల పెరుగుదలకు, అభివృద్ధికి ఆలీనొ ళిద్యమం ప్రధాన ఆయుధంగా మారిందన్నారు. అంతరిక్ష, సామాజిక, ఆర్థిక రంగాల్లో పరస్పర సహకారం వల్ల ఎంతో లబ్ధి చేకూరుతోందన్నారు. గతం కంటే ప్రపంచ పాలన వ్యవస్థ మెరుగుపడిందని చెప్పారు. ప్రస్తుత ఆర్థిక, రాజకీయ సంక్షోభాల వల్ల దానికి ప్రమాదం పొంచి ఉందన్నారు. భారత్‌-ఆఫ్రికా దేశాలు పరస్పరం సహకారం అందజేసుకుం టున్నాయని చెప్పారు. ఇరాన్‌ అభివృద్ధికి భారత్‌ పూర్తి సహకారం అందిస్తుందన్నారు. పశ్చిమ ఆసియా, ఉత్తర ఆఫ్రికా ప్రాంతాల్లో క్రమంగా మార్పు కనిపిస్తోందన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌ ప్రజాస్వామ్య, బహుళ
ప్రయోజనాలకు ప్రాధాన్యమిస్తోందన్నారు. విదేశీ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం తగదని హితవు పలికారు. ప్రధానంగా సిరియా విషయంలో ఈ పద్ధతి మారాలన్నారు. దీనిపై అందరూ ఏకీభవించేలా ఆలీనోద్యమం ఒక విధాన నిర్ణయాన్ని తీసుకోవాలని పిలుపునిచ్చారు. సిరియా సంక్షోభానికి తెరదించేందుకు అందరూ కృషి చేయాలని కోరారు. సిరియా ప్రజల మనోభావాలకు అనుగుణంగా అక్కడ శాంతియుతంగా రాజకీయ ప్రక్రియ ప్రారంభం కావాలని ఆకాంక్షించారు. పాలస్తీనియన్ల హృదయాలను సంపాదించడంలో ఆలీనోద్యమం ఎప్పుడు ముందుంటుందని ప్రధాని చెప్పారు. పాలస్తీనియా ప్రజలు శాంతియుత జీవనం కొనసాగించేందుకు, స్వపరిపాలన చేసుకునేందుకు ‘నామ్‌’ పరిష్కార మార్గం చూపాలని అభిప్రాయపడ్డారు. గతంలో ఎవరికి వారు చేసిన వాద నలకు గుర్తింపు లేదని, మనమంతా ఏకమైతేనే గుర్తింపు వచ్చిందని మన్మోహన్‌ గుర్తు చేశారు. వివిధ అంశాలపై మన వాదనను మరోసారి బలంగా వినిపించాల్సిన తరుణం వచ్చిందన్నారు. ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న వివిధ సమస్యలపై చర్చించాల్సిన అవసరం ఉందని ప్రధాని అభిప్రాయపడ్డారు. పరస్పరం సహకరించుకుంటూ, కొత్త విధానాలు అవలంభిస్తూ సమస్యలు పరిష్కరించుకోవాలని సూచించారు. అంతర్జాతీయ తీవ్రవాదం, ఆయుధాల సరఫరా, పైరసీ, సైబర్‌ నేరాలు అభివృద్ధికి విఘాతం కలిగిస్తున్నాయని, వీటిపై ఉమ్మడిగా పోరాడాలని మన్మోహన్‌ పిలుపుని చ్చారు. అలాగే, నీరు, విద్యుత్‌ విషయంలో మరింత పురోగతి సాధించాల్సిన అవసరం ఉందన్నారు. ఆయా అంశాల్లో మరింత ప్రభావవంతంగా పని చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ మేరకు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి, ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్‌ పలు సంస్కరణలు తీసుకువస్తుందని ఆకాంక్షించారు. ఆహార భద్రతా ప్రధాన సమస్యగా మారిందని ప్రధాని చెప్పారు. ఊహాగానాలు, వ్యవస్థీకృత అవాంతరాలు, సహకార లేమి తదితర అంశాల కారణంగా ఆహార ద్రవ్యోల్బణం పెరిగిందన్నారు. దీన్ని అధిగమించేందుకు సవిూకృత ఆహార విధానాన్ని అమలు చేయాలని సూచించారు. వ్యవసాయ, ఆహార ఉత్పత్తులను పెంపొందించడం, వ్యవసాయ రంగంలో పరిశోధనలు, అభవృద్ధి, వాతావరణ అంశాలపై చర్చ జరగాలన్నారు. పెట్టుబడులు, మానవ వనరుల అభివృద్ధి వాతావరణ అంశాలపై చర్చ జరగాలన్నారు. పెట్టుబడులు, మానవ వనరుల అభివృద్ధి పైనా దృష్టి సారించాలని సూచించారు. యువతను సద్వినియోగం చేసుకుంటే.. వారే సవాళ్లకు దీటైనా పరిష్కార మార్గాలను కనుగొంటారని అభిప్రాయపడ్డారు. భారత్‌లో సాంకేతిక పరిజ్ఞానం,యువతలో నైపుణ్యాలు పెంచేందుకు కృషి చేస్తున్నాని ప్రధాని వివరించారు.