ప్రభుత్వం అవినీతి సొమ్ము రుచి మరిగింది

హైదరాబాద్‌: మద్యం మాఫియా వల్ల వచ్చిన అవినీతి సొమ్ము రుచి మరిగిన ప్రభుత్వం మద్యం విధానాన్ని మార్చడానికి సిద్ధంగా లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ చెప్పారు. అవినీతికి అలవాటు పడిన ప్రభుత్వం కూలిపోక తప్పదని ఆయన చెప్పారు. బెల్టు షాపులను రద్దు చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నామని  అన్నారు. ఎరువులు, విత్తనాలు సమృద్ధిగా ఉన్నాయని కబుర్లు చెప్పిన మంత్రి ఇప్పుడు లోపాలను అధిగమించడానికి వీల్లేని పరిస్థితికి  చేరుకున్నారని తెలియజేశారు. వామపక్షాల మధ్యనున్న అంతర్గత విషయాలను సీపీఎం ఎందుకు రాద్దాంతం చేస్తుందో అర్థం కావడం లేదని నారాయణ చెప్పారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్య సేవల కోసం ఏఐవైఎఫ్‌ ఆందోళన చేయనున్న దృష్ట్యా ఏఐవైఎఫ్‌ సమరశంఖం పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు.