* ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటం

 

* ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ లు వెంటనే విడుదల చేయాలి

* ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠ రెడ్డి

కరీంనగర్ బ్యూరో (జనం సాక్షి ) :
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని దాదాపు గత రెండు సంవత్సరాలకు సంబంధించిన ఫీజు బకాయిలు పెండింగ్లో ఉన్నాయని ప్రభుత్వం విడుదల చేయకపోవడంతో విద్యార్థులు నానా ఇబ్బందులు పడుతున్నారని ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని ఫీజులు కడితేనే సర్టిఫికెట్లు ఇస్తామని విద్యార్థులను వేధిస్తున్నాయని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పెండింగ్ లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని లేనిపక్షంలో విద్యార్థులను కలుపుకొని పెద్దఎత్తున ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్ విడుదల చేసే వరకు ఉద్యమిస్తామని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠ రెడ్డి ఒక ప్రకటనలో హెచ్చరించారు.
గత ఐదు సంవత్సరాలకు సంబంధించినటువంటి ఫీజు బకాయిలు మొత్తం ఐదు వేల కోట్లు పైనే పెండింగ్లో ఉన్నాయని దీనివల్ల పేద మధ్యతరగతి విద్యార్థులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విద్యా సంవత్సరం పూర్తి అయి సర్టిఫికెట్ల కోసం కళాశాలలకి వెళితే ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు ఫీజు రీయింబర్స్మెంట్ రాలేదని ఇప్పుడు పైసలు కడితేనే సర్టిఫికెట్లు ఇస్తామని ఫీజు రియంబర్స్మెంట్ వచ్చాక మీ పైసలు మీకు ఇస్తామని చెపుతున్నయని ఆర్థిక స్థోమత లేని పేద మధ్యతరగతి విద్యార్థులు ఫీజులు చెల్లించలేక సర్టిఫికెట్లు తీసుకోకుండా పై ఉన్నత చదువులకు వెళ్లడానికి నానా ఇబ్బందులు పడుతూ అప్పులు చేస్తూ ఫీజులు కడుతున్నారని బంగారు తెలంగాణ అనే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను విడుదల చేయకుండా ఎందుకు ఇబ్బందులు పెడుతున్నారని బడ్జెట్ కళాశాలలు సైతం ఫీజు రియంబర్స్మెంట్ రాకపోవడంతో సిబ్బందికి జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉందని అంతేకాకుండా విద్యార్థులకు నాణ్యమైన విద్యను కూడా అందించిన పరిస్థితి ఉందని కొన్ని కళాశాలలకు బిల్డింగ్ యాజమాన్యాలు అద్దె చెల్లించకపోవడంతో కళాశాలలకు తాళాలు వేసే పరిస్థితి వచ్చిందని దీనివల్ల విద్యార్థులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వెంటనే పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని లేనిపక్షంలో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఫీజు బకాయిలను విడుదల చేసేంతవరకు ఉద్యమిస్తామని మణికంఠ రెడ్డి తెలిపారు