ప్రభుత్వకార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలి
హైదరాబాద్: ప్రభుత్వ కార్యక్రమాలను పార్టీ పథకాలుగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ధర్మానప్రసాదరావు కమిటీకి పలువురు కాంగ్రెస్ ఎమ్మోల్యేలు, ఎమ్మెల్సీలు సూచించారు. అందరి అభిప్రాయాలను సేకరించి ఈ నెల 21న ముఖ్యమంత్రికి, పీసీసీ అధ్యక్షునికి ప్రాథమిక నివేదిక ఇవ్వనున్నట్టు కమిటీ సభ్యడు కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు. కాంగ్రెస్ పథకాలను తమవిగా కొందరు హైజాక్ చేస్తున్నారని వాటిని తిప్పికొట్టాలని వారు కోరారు.