ప్రభుత్వ పాఠశాలలను పర్యవేక్షించిన:అడిషనల్ కలెక్టర్.

ధర్మపురి మండలంలోని మన ఊరు మన బడి క్రింద ఎంపిక చేయబడిన ప్రభుత్వ పాఠశాలలైన దోనూర్ ప్రాథమిక పాఠశాల మరియు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ధర్మపురి నందు చేపడుతున్న పనులను జిల్లా అడిషనల్ కలెక్టర్ మంద మకరంద్ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా దోనూర్ ప్రాథమిక పాఠశాల నందు వివిధ కాంపోనెంట్ల కింద మంజూరైన పనులను పర్యవేక్షించారు, అదేవిధంగ ఆయా పనులను త్వరితగతీన పూర్తిచేసి ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉంచాలని సంబంధిత కాంట్రాక్టర్లను ఆదేశించారు. అనంతరం ధర్మపురి పట్టణ కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు మనబస్తీ  మనబడి ప్రాజెక్టు కింద చేపట్టుతున్న పనులను పర్యవేక్షించి వివిధ కంపోనెంట్ల వారీగా ఏఈ ని వివరములు అడిగారు. జిల్లా అడిషనల్ కలెక్టర్ వెంట మండల విద్యాధికారి బత్తుల భూమయ్య, ఏ.ఇ భోగ సతీష్ ,దోనూర్ గ్రామ సర్పంచ్ కొండపల్లి సువర్ణ ఉప సర్పంచ్ జంగిలి మధుకర్ ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు కాశెట్టి రమేష్, బక్క శెట్టి మల్లేశం తదితరులు పాల్గొన్నారు.