ప్రభుత్వ పాఠశాలల్లో మెనూ ప్రకారం నాణ్యమైన మధ్యాన భోజనం పెట్టాలి”  :ఏబీవీపీ ప్రభుత్వ పాఠశాలల్లో మెనూ ప్రకారం నాణ్యమైన మధ్యాన భోజనం పెట్టాలి”  :ఏబీవీపీ 

ఇబ్రహీంపట్నం, ఫిబ్రవరి24(జనంసాక్షి):-అఖిల భారతీయ విద్యార్థి పరిషత్  యాచారం శాఖ ఆధ్వర్యంలో స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏబీవీపీ నాయకులు మధ్యాన భోజనాన్ని పరిశీలించారు.మరియు భోజనాన్ని  తిన్నారు.మధ్యాన భోజనాన్ని పరిశీలించి,తిన్న అనంతరం ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దొంతగొని శివకృష్ణ  మాట్లాడుతూ ప్రతి విద్యార్థినికి నాణ్యమైన భోజనం పెట్టాలని,ప్రతి రోజు ఒక్కే రకమైన కూరలు కాకుండా మెనూ ప్రకారం భోజనాన్ని పెట్టాలని అన్నారు.పేద విద్యార్థుల పౌష్టిక ఆహరం కోసం ఏర్పాటు చేసిన మధ్యాన భోజనం ఇప్పుడు ఆ ఫలాల లక్ష్యాలను అందుకోలేక పోతుంది.నేడు విద్యార్థులకు పాఠశాలల్లో పెట్టే  భోజనం తో విద్యార్థినులకు ఏ మాత్రం ఉపయోగంగా లేదని వారు ఆరోపించారు.పేరుకు మాత్రమే సన్న బియ్యం,సర్కారు బడులలో మధ్యాన భోజనం అని ప్రభుత్వానిది గొప్పలు చెప్పడం తప్ప వాస్తవంగా విద్యార్థులకు సరిగ్గా భోజనం పెట్టట్లేదు.ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా మేలుకొని ప్రభుత్వ పాఠశాలలకు నాణ్యమైన బియ్యాన్ని,సరకులని పంపించాలని వారు డిమాండ్ చేసారు.లేని పక్షంలో విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెట్టేంతవరకు ఏబీవీపీ ఉద్యమిస్తుందని ఈ సందర్బంగా ప్రభుత్వాన్ని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో నాయకులు  సందీప్,జగదీష్,శివ,వంశీ,శివ ఉన్నారు .