ప్రభుత్వ ప్రచార వేదికగా అసెంబ్లీ మారింది

– స్పీకర్‌ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు
– తెదేపా నేత ఆర్‌.కృష్ణయ్య
హైదరాబాద్‌, నవంబర్‌ 7(జ‌నంసాక్షి) : అసెంబ్లీని ప్రభుత్వం ప్రచార వేదికగా మార్చేసిందని టీటీడీపీ
అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య అన్నారు. మంగళవారం అసెంబ్లీ విూడియా పాయింట్‌ వద్ద ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం కేవలం వారు అమలు చేస్తున్న పథకాలను మాత్రమే ప్రచారం చేసుకుంటుందని, ప్రతిపక్షాల లేవనెత్తిన సమస్యలపై స్పష్టమైన వివరణ ఇవ్వటం లేదని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రతిపక్ష నాయకుల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తోందని పేర్కొన్నారు. ప్రతిపక్ష సభ్యులు ఏవైనా మాట్లాడదామని సమయం తీసుకేంటే స్పీకర్‌ మైక్‌ కట్‌చేస్తున్నారన్నారు. స్పీకర్‌ మధుసూదనచారి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, స్పీకర్‌ తన వైఖరి మార్చుకోవాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం బీసీలను ఎందుకు చులకనగా చూస్తుందని ప్రశ్నించారు. బీసీలకు నిధులు కేటాయించడం లేదన్నారు.. కేవలం ఓట్లకు మాత్రం వాడుకుంటున్నారని అన్నారు. ఎంబీసీలను గుర్తించలేదు కానీ వారికి రూ.1000 కోట్లు
కేటాయించారని పేర్కొన్నారు.