ప్రమాదంపై విచారణకు ఆదేశించాం: ముకుల్‌ రాయ్‌

నెల్లూరు: తమిళనాడు ఎక్స్‌ప్రెస్‌ ప్రమాదంపై దర్యాప్తునకు ఆదేశించామని రైల్వే శాఖ మంత్రి ముకల్‌రాయ్‌ ప్రకటించారు. ఈ సందర్భంగా విలేకర్లతో మాట్లాడుతూ ప్రమాదం జరిగిన వెంటనే అధికారులు, సిబ్బంది స్సందించారన్నారు. సోమవారం ఆయన రైలు ప్రమాదంలో బధితులను పరామర్శించారు. ప్రమాదఘటనపై విచారణకు ఆదేశించామని తెలిపారు. సంఘటనకు గల కారణాలు ఇప్పుడే చెప్పలేమన్నారు. త్వరలోనే నిజాలు వెలుగులోకి వస్తాయన్నారు. మృతుల కుటుంబాలకు రూ.5లక్షలు పరిహరం ప్రకటించారు. ప్రయాణికుల భద్రతకు రైల్యేశాఖా ప్రాధాన్యమిస్తోందన్నారు. రైల్యే ప్రమాదాల నివారణకు సాంకేతిక సాయం చేయాలని ప్రధానమంత్రిని కోరినట్లు వెల్లడించారు.